సీఎం రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరతీస్తున్నారన్న, దౌర్భాగ్య సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు. 10 ఏళ్ల తెలంగాణలో ఇలాంటి హింసాయుత ఘటనలు ఎప్పుడూ చూడలేదు. మా పదేళ్ల పాలనలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఇప్పుడు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాంతీయవాదాన్ని తెచ్చి, హింసను రేపుతున్నారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చెయ్యలేరు. ముఖ్యమంత్రి 22 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. ఒక ఎమ్మెల్యే ఇంటికి గూండాలను పోలీసుల ఎస్కార్ట్ ఇచ్చి పంపారు. ఇంత దౌర్భాగ్య సీఎంని ఎక్కడా చూడలేదు. 100 రోజుల్లో గ్యారెంటీ హామీలను అమలు చేస్తానన్న సన్నాసి ఎక్కడ అని ప్రశ్నిస్తే.. మాపై దాడులకు దిగుతున్నారు” అని కేటీఆర్ అన్నారు.
“హైదరాబాద్ ప్రజలు తనకు ఓటు వెయ్యలేదనే రేవంత్ రెడ్డి.. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా మా వాళ్లే. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రాంతీయ తత్వంపై దాడి చెయ్యలేదు. కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ నోటికొచ్చినట్లు తిట్టడం ఏం సంస్కృతి. చరిత్రలో పనికిమాలిన ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారు. పెద్ద పెద్ద వారితో తలపడ్డాం. రేవంత్ రెడ్డి బుల్లోడు. ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్‌లో ఉన్నానని చెప్పడం.. కామెడీయే అని కేటీఆర్ అన్నారు.