వాస్త‌వాలు బ‌య‌ట‌పెడితే దాడులు చేస్తారా..

Date:

రుణ‌మాఫీపై చ‌ర్చ‌కు రావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డికి స‌వాల్ విసిరితే స్పందించ‌డం లేద‌ని, తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హెచ్చరించారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌తో పాటు పలువురు బిఆర్ఎస్‌ నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. గురువారం తిరుమలగిరిలో భారాస ధర్నా శిబిరంపై కాంగ్రెస్‌ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి చెప్పారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ”కాంగ్రెస్‌ నేతలు చారాణా కూడా రుణమాఫీ కూడా చేయలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. భవిష్యత్‌లో చర్యకు ప్రతిచర్య ఉంటుంది” అని కేటీఆర్‌ అన్నారు.

Share post:

Popular

More like this
Related

కొండా లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ మ‌ర‌వ‌దు

కేసీఆర్‌ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్థలం ఇచ్చి, నిలువ...

మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించండి

దేశంలో మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు...

వినూత్న కథాంశంతో మైక్రో ఫిల్మ్ దిక్సూచి

స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలే ప్ర‌ధాన అంశంగా వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...