యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీగా ఆదాయం లభించింది. స్వామివారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.రెండున్నర కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కొండకింద శ్రీసత్య నారాయణస్వామి వ్రత మండపంలో చేపట్టిన ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో రూ.2,66,68,787, మిశ్రమ బంగారం 87 గ్రాములు, వెండి 3,300 గ్రాములు చొప్పున వచ్చినట్లు ఈవో భాస్కరరావు వెల్లడించారు. లెక్కింపులో ఈవోతో పాటు ఆలయ ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ సిబ్బందితో పాటు సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారికి భారీగా విదేశీ కరెన్సీ కూడా వచ్చింది.