మీ ఏరియాలో వీధి కుక్కలున్నాయా..

Date:

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు వీధి కుక్కల దాడులు ప్రజలపై పెరుగుతుండటంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిహెచ్ఎంసీ ట్వీట్ చేసింది.

డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్‌ చేస్తాయని పేర్కొంది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు చనిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వీదికుక్కల బెడదను నివారించేందుకు GHMC ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అప్రమత్తమైన జీహెచ్ ఎంసీ వీధి కుక్కల స్టెరిలైజేషన్, కుక్కల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...