మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టొద్దు

Date:

వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తలను పోస్ట్‌ చేస్తున్న ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్‌వేదికగా పోస్ట్‌ చేసింది. జస్ట్‌ వాచ్‌ బీబీసీ, ట్రోల్స్‌ రాజా, బచినా లలిత్‌, హైదరాబాద్‌ కుర్రాడు, ఎక్స్‌వైజెడ్‌ఎడిట్‌007 యూట్యూబ్‌ ఛానళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి.

హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్‌ వీడియోలను డిలీట్‌ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ”ట్రోలింగ్ వీడియోలు చేసే వారికి, అసభ్యకరమైన వీడియోలు చేసే వారికి ఒక 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నా. దయచేసి అలాంటి వీడియోలన్నీ తక్షణమే తొలగించండి. ఒకవేళ మీరు తొలగించకపోతే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తాం.అలాగే మీ యూట్యూబ్‌ ఛానళ్లు బ్యాన్ అయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా” అని మంచు విష్ణు వీడియోలో విజ్ఞప్తి చేశారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...