తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు..

Date:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని చెప్పింది. ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కొమొరిన్‌ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. అలాగే, బుధ, గురువారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో కొత్తగూడెం, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, జనగాం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జనగామలో 9 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...