తెలంగాణలో ఇంకా థర్డ్ డిగ్రీలు ఏంటీ..?

Date:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా షాద్ నగర్ ఘటన కలకలం రేపింది. దళిత మహిళపై పోలీసులు రాత్రిపూట స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. కొంచెం ఆలస్యంగానైనా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందించారు. ‘ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండి? బుద్ధి ఉందా?’ అని ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతాయని, బయటికి రానివి పది రెట్లు ఉంటాయని చెప్పారు.

బలహీనవర్గాలపై ఇలాంటి దాడులను దయచేసి ఆపండి అంటూ పోలీసులకు ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ‘మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు. కానీ, ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్‌మెంట్ అంతా బద్నాం అవుతుంది’ అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, డిపార్ట్‌మెంట్ క్రమశిక్షణ చర్యలతోపాటు చట్టపర చర్యలు తీసుకుని నిందితులను జైలుకు పంపాలని కోరారు. ఇంకా ఎన్నాళ్లు ఈ థర్డ్ డిగ్రీల చిత్రహింసలు? దయచేసి తెలంగాణను థర్డ్ డిగ్రీ చిత్రహింసల నుంచి విముక్తి చేయండి అంటూ రాష్ట్ర డీజీపీ ట్యాగ్ చేసి కోరారు. పోలీసుల దాడులను నిలిపేయాలని పేర్కొంటూ రాష్ట్ర సీఎంవోను ట్యాగ్ చేశారు.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...