మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు డబ్బుల కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అనుమతిచ్చారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాహులే వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నారని ఆరోపించారు. హైడ్రాను నడిపిస్తోంది సీఎం రేవంత్‌రెడ్డి కాదని.. రాహుల్ గాంధీయేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.
”కేవలం డబ్బు కోసమే మూసీ ప్రాజెక్టును చేపట్టారు. బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?ఈ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో త్వరలో బయటపెడతా. కాంగ్రెస్‌కు నోట్ల కట్టలు కావాలి కానీ.. బాధితుల కష్టాలు పట్టవా?ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్. దీనిపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదు. దీనికోసం డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు?ఈ అంశంపై 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తా. సీఎం, మంత్రులకు సయోధ్య ఉన్నట్లు లేదు. ఈ సీఎం.. మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు”అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.