నిత్యం తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతున్న తనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే వికృత రాజకీయాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కకు మళ్లించటానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే.. ‘గోల్కొండ కోట, చార్మినార్‌లలో కూడా హరీశ్‌రావుకు వాటాలు ఉన్నాయి’ అనేటట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకుగాను లీగల్ నోటీస్ పంపుతున్నాను. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.