కేసీఆర్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Date:

బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వొకేట్ జనరల్(ఏజీ) తెలిపారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది.

జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదనల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం విలేకర్ల సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అంటున్నారన్నారు. అనుమానించడం కాదని, దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది. జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొంది. కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ ఛైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదంది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవడానికే ఆయనకు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చినట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...