Saturday, November 9, 2024
Homeతెలంగాణకేసీఆర్‌ ఎప్పుడో పనులు మొదలుపెట్టారు

కేసీఆర్‌ ఎప్పుడో పనులు మొదలుపెట్టారు

Date:

బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో మురుగు నీటి శుద్ధికి సుమారు రూ.4 వేల కోట్లు కేటాయించామని, అప్పుడు నిర్మించిన ఎస్టీపీలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఎప్పుడో మూసీ పునరుజ్జీవం పనులు మొదలుపెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నారు. నాచారంలోని ఎస్టీపీని ఆయన పరిశీలించి మాట్లాడారు. 

”రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవన్నారు. ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని మంత్రులు అంటున్నారు. మూసీ పునరుజ్జీవానికి మాత్రమే ప్రభుత్వం వద్ద పైసలు ఉన్నాయి. ఇందుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం చెప్పారు. మూసీ పునరుజ్జీవం ఎవరి కోసం చేస్తున్నారు? స్థిరాస్థి వ్యాపారానికి కాదా? మూసీ పేరు చెప్పి కాంగ్రెస్‌ దోచుకుంటోంది. మూసీ బ్యూటిఫికేషన్‌కు మేము వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్‌కే వ్యతిరేకం. ఇక్కడి నిర్వాసితులకు భారాస అండగా ఉంటుంది” అని కేటీఆర్‌ తెలిపారు.