Saturday, December 7, 2024
Homeతెలంగాణఈ నెల 8న రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌..?

ఈ నెల 8న రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌..?

Date:

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న త‌న‌ పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి క్షేత్రంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నారని సమాచారం. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. మంత్రి కోమటిరెడ్డితో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు చర్చించారు.

నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఖజానాకు అదనపు నిధుల సమీకరణపై సమావేశంలో చర్చించారు. సంబంధిత శాఖల అధికారులతో ఉపసంఘం చర్చలు సాగాయి.