Saturday, November 9, 2024
Homeప్రత్యేక కథనాలుమీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా.?

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా.?

Date:

స్మార్ట్ ఫోన్ ప్రతి మనిషి జీవన విధానంలో ప్రధాన భాగమైపోయింది. ఏ చిన్న పనికైనా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ వాడే పరిస్థితి వచ్చేసింది. అన్ని రకాల అవసరాలకు యాప్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లిన సమయంలో సమాచారం కోసం కూడా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే రూట్‌ మాప్‌, ఫాస్టగ్‌ రీఛార్జ్‌ ఇలా రకరకాల అవసరాలకు ఒక్కో యాప్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ అవసరాలకు ఒకే యాప్‌ అందుబాటులో ఉంది అదే ‘రాజ్‌మార్గ్‌యాత్ర’. ఈ యాప్‌ సహాయంతో అన్ని రకాల సేవలు ఒకే చోట పొందొచ్చు. ఈ యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా నేషనల్‌ హైవేస్‌పై వెళ్లే సమయంలో అవసరమయ్యే అన్ని సమాచారాలను ఈ యాప్‌ అందిస్తోంది. రెస్టారెంట్స్, పెట్రోల్‌ పంపులు, ఛార్జింగ్‌ స్టేషన్లు, హాస్పిటల్స్, ఏటీఎంలు, పోలీస్‌ స్టేషన్లు, పర్యటక ప్రదేశాల గురించి.. ఇలా అన్ని వివరాలను ఈ యాప్‌ అందిస్తుంది. రోడ్లకు సంబంధించి ఏవైనా సమస్యలున్నా ఈ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. ‘రిపోర్ట్ అన్‌ ఇష్యూ ఆన్‌ ఎన్‌హెచ్‌’ ఆప్షన్‌ సహాయంతో ఫిర్యాదు చేయొచ్చు.

ఈ యాప్‌లోనే ఫాస్టాగ్‌కు సంబంధించిన సేవలు కూడా పొందొచ్చు. కొత్త ఫాస్ట్‌గ్‌తో పాటు, నెలవారీ పాస్‌లు పొందొచ్చు. ఇక జాతీయ రహదారులపై మీరు వెళ్తున్న మార్గంలో ఎక్కడెక్కట టోల్‌ ప్లాజాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుందన్న విషయాలు ముందే తెలుసుకోవచ్చు. ‘Toll Plaza Enroute’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీరు బయల్దేరుతున్న ప్రాంతం, చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్‌ చేసి సెర్చ్‌పై క్లిక్‌ చేస్తే మీకు కావాల్సిన టోల్​ ప్లాజా వివరాలన్నీ అందులో కన్పిస్తాయి.

మీ వాహనవేగాన్ని అంచనా వేస్తూ, అలర్ట్ చేసే ఫీచర్‌ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఓవర్‌ స్పీడ్‌ నోటిఫికేషన్ ద్వారా మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఇక వాహనదారుల కోసం హైవే అసిస్టెన్స్‌, పోలీస్‌ అసిస్టెన్స్‌, ఎమర్జెన్సీ నంబర్లు ఎమర్జెన్సీ ఆప్షన్‌లో కన్పిస్తాయి. మీరు ప్రయాణిస్తున్న హైవే వివరాలు కూడా అందులో డిస్​ప్లే అవుతాయి. కావాలంటే మీ జర్నీని రికార్డ్‌ చేసుకోచ్చు. ఈ యాప్‌ ఇంగ్లిష్‌, తెలుగుతో పాటు మరో 12 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌తోపాటు, యాపిల్‌ యూజర్లకు సైతం ఈ యాప్‌ అందుబాటులో ఉంది.