వ‌ర్షాల్లో న‌ష్ట‌పోయే ఆస్తికి ఇన్సూరెన్స్ ఉంటుందా..

Date:

వర్షాకాలంలో కురిసే కుండపోత వర్షాలకు వరదలు రావచ్చు. ఫలితంగా ఇళ్లు దెబ్బతింటాయి. కొన్నిసార్లు సమీపంలోని కొండచరియలు విరిగిపడతాయి. పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అత్యంత విలువైన ఇల్లు నామరూపాల్లేకుండా ధ్వంసం అవుతుంది. ఇలాంటి భారీ నష్టం నుంచి బయట పడాలంటే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్ ప్రాపర్టీ నష్టాల నుంచి రక్షించే ఈ హోమ్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సొంత ప్రాపర్టీ అయిన బంగ్లా, ఇల్లు లేదా రెంటెడ్ ఫ్లాట్, చిన్న అపార్ట్‌మెంట్ వంటి ఇళ్లే అన్నింటికీ ఇన్సూరెన్స్‌ చేయించుకోవచ్చు. అంటే ఈ ఇల్లు ఏదైనా ప్రమాదానికి గురైతే, ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీ భరిస్తుంది. నిజానికి మనం కట్టుకున్న గుడిసెలకు కూడా కవరేజీ పొందవచ్చు.

*ఎవరు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు?*

సొంతిళ్లు ఉన్నవారు, ఇల్లు అద్దెకు ఇచ్చేవారు లేదా అద్దెకు తీసుకున్నవారు ఎవరైనా సరే, తమ ఇంటికి ఇన్సూరెన్స్‌ చేయించుకోవచ్చు. ఆ ఇల్లు మన పేరు మీద ఉన్నా, లేదా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నా, రెండు సందర్భాల్లోనూ ఇన్సూరెన్స్‌ పొందవచ్చు. ఒక రెంట్‌ ఇంట్లో ఉన్న ఫర్నిచర్, విలువైన సామగ్రికి కూడా కవరేజ్‌ లభిస్తుంది. రెంట్ తీసుకున్న ఇంటికి ప్రమాదవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్‌ భరిస్తుంది. అదే విధంగా, ఇల్లు కొని అందులో ఏదైనా వ్యాపారం చేస్తుంటే, ఆ ఇంటికి హోమ్ ఇన్సూరెన్స్‌ కాకుండా, వ్యాపారానికి సంబంధించిన వేరొక ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ అంటే కేవలం ప్రజలు నివసించే ఇళ్లకే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.

హోమ్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేవి ఇవే!

*ఇంటి నిర్మాణం*

ఇంటి గోడలు, పైకప్పు, ఇంటి చుట్టూ ఉన్న గోడలు, కారు గ్యారేజ్ స్పేస్, సోలార్ ప్యానెల్స్, నీళ్ల ట్యాంకులు, ఇంటి లోపలి ఫ్లోర్స్‌ ఇవన్నీ ఇంటి నిర్మాణంలో భాగం. ఇలాంటి నిర్మాణాలకు నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్‌ కవరేజీ లభిస్తుంది.

*ఇంటి సామాన్లు*

టీవీ, రిఫ్రిజిరేటర్, బట్టలు, బెడ్స్‌, ఇతర సామాన్లు ఇవన్నీ ఇంటి సామాన్ల కిందకు వస్తాయి. వీటికి నష్టం వాటిల్లితే కంపెనీ డబ్బులు ఇస్తుంది. అలాగే, బంగారం, చిత్రాలు, వెండి సామాన్లు లాంటి విలువైన వస్తువులకు కూడా అదనపు డబ్బులు చెల్లించి ఇన్సూరెన్స్‌ పొందవచ్చు.

*ఇంటి అద్దె*

ఇన్సూరెన్స్ చేసిన ఇల్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్‌ అయితే, నివసించడానికి పనికిరాకుంటే, వేరే ఇల్లు అద్దెకు తీసుకుంటాం. ఆ అద్దె ఖర్చులను కూడా ఇన్సూరెన్స్‌ కంపెనీ భరిస్తుంది. ఇది కూడా ఒక యాడ్-ఆన్ ఫెసిలిటీ అని గమనించాలి.

*ప్రమాదవశాత్తు మరణం*

ఇది యాడ్-ఆన్ లేదా ఒక ఆప్షనల్ కవరేజీ. ఇంటికి జరిగిన ప్రమాదంలో ఇంటి యజమాని లేదా వారి పార్ట్‌నర్ చనిపోతే, అప్పుడు రూ.5 లక్షల వరకు డబ్బు ఇస్తారు.

Share post:

Popular

More like this
Related

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...

విద్యుత్ అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చెయ్యండి

ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి. ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం అందుబాటులో ఉండాలి.....

జూనియ‌ర్ వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్ కాదు

పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన...