మంకీపాక్స్.. మనకు వ్యాప్తి చెందేనా..?

Date:

ఆఫ్రికా దేశాల ప్రజలను ఎంపాక్స్‌ వైరస్‌ గడగడలాడిస్తోంది. మంకీపాక్స్ అని కూడా పిలిచే ఈ మహమ్మారి, మన పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో కూడా అలజడి సృష్టిస్తోంది. ఈ అంటువ్యాధి భారతదేశంలో వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా సరే, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అప్పటినుంచి ఈ వ్యాధి గురించి చాలా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక జూనోటిక్ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఈ వైరస్ మొదట 1958లో కోతుల్లో, తర్వాత 1970లో మనుషుల్లో కనిపించింది. ఇది చాలా అరుదైన వ్యాధి. దీని బారిన పడిన వారికి దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మంకీపాక్స్ లక్షణాలు, స్మాల్‌పాక్స్‌ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తిని తాకినా లేదా వారికి దగ్గరగా ఉన్నా. ఇది ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. ఈ డిసీజ్ ఉన్న జంతువులను తాకినా, మనుషులకు సోకవచ్చు.

*మంకీపాక్స్ వ్యాప్తి*

మంకీపాక్స్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో అనేది ఇన్ఫెక్షన్ స్టేజ్‌, వ్యాధి ఉన్న వ్యక్తిని ఎలా తాకామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధి మూడు దశల్లో వ్యాపిస్తుంది. అవి ఇంక్యుబేషన్ పీరియడ్, సింప్టమాటిక్ పీరియడ్, వ్యాధి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న సమయం.

*ఇంక్యుబేషన్ పీరియడ్*

మంకీపాక్స్ వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత 5 నుంచి 21 రోజుల వరకు వ్యాధి లక్షణాలు కనిపించవు. ఈ సమయంలో కూడా బాధితులకు తెలియకుండానే వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉంది.

*సింప్టమాటిక్ పీరియడ్*

ఈ దశలో జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దద్దుర్లు మొత్తం తగ్గిపోయి, పుండ్లు మానిపోయి పొక్కులు ఊడిపోయిన తర్వాత వ్యాధి వ్యాపించే అవకాశం తగ్గుతుంది.

*ఎవరికి రిస్క్ ఎక్కువ?*

మంకీపాక్స్ ఉన్న జంతువుల రక్తం, శరీర ద్రవాలు లేదా పుండ్లను నేరుగా తాకితే ఈ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. జంతువులను తాకేటప్పుడు సరైన రక్షణ తీసుకోకపోతే ఈ వైరస్ సోకుతుంది. వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతున్న ప్రాంతంలో నివసించే వారికి ఈ వ్యాధి త్వరగా రావచ్చు. వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు రిస్క్ ఎక్కువ.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...