గూగుల్ లో మీరు సెర్చ్ చేసే ప్రతి దానిపై నిఘా..

Date:

ప్రస్తుత కాలంలో అందరి చేతుల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ప్రపంచంలో చాలా మంది ఏ సమాచారానికి ఐనా గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు అందులో లభించే సమాచారం నిజమా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. అయితే గూగుల్ సెర్చ్ సమయంలో మనం దేన్ని వెతుకుతున్నామో, దేన్ని వెతక్కూడదో తెలుసుకోవడం ముఖ్యం. గూగుల్ సెర్చ్లో మీరు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని జైలులో పెట్టవచ్చు. మీరు గూగుల్లో దేన్నీ సెర్చ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా పైరసీ గురించి సెర్చ్ చేయోద్దు

చాలా మంది వ్యక్తులు ఉచితంగా సినిమాలు లేదా వెబ్ సిరీస్లను చూడటానికి గూగుల్లో సెర్చ్ చేస్తారు. కానీ మీరు కొత్త సినిమాలను పైరేట్ చేసినా లేదా గూగుల్లో సెర్చ్ చేసినా అది నేరం కిందకు వస్తుంది. మీకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది కాకుండా మీకు రూ.10 లక్షల జరిమానా కూడా పడచ్చు.

చైల్డ్ పోర్న్ లేదా చైల్డ్ క్రైమ్ గురించి సెర్చ్ చేయోద్దు..

చైల్డ్ పోర్న్ను గూగుల్ ఏమాత్రం ప్రమోట్ చేయదు. మీరు దీని కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది కూడా నేరం కిందకే వస్తుంది. దీనికి సంబంధించి భారతదేశంలో చట్టం కఠినంగా ఉంది. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం చైల్డ్ పోర్న్ చూడటం, అలాంటివి క్రియేట్ చేయడం, సేవ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది. మీరు ఈ కేసులో పట్టుబడితే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ నేరానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

బాంబు లేదా ఆయుధాన్ని ఎలా తయారు చేయాలో వెతకొద్దు..

గూగుల్లో బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతిని తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. మీరు ఇలా చేస్తే భద్రతా సంస్థల రాడార్పైకి వస్తారు. మీపై తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంతే కాదు ప్రెషర్ కుక్కర్ బాంబు తయారీ విధానాన్ని గూగుల్లో సెర్చ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది.

అబార్షన్ గురించి కూడా సెర్చ్ చేయకూడదు

గూగుల్లో అబార్షన్ గురించి ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే డాక్టర్ అనుమతి లేకుండా అబార్షన్ చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం. మీరు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే, మీరు ఘోరంగా దొరికిపోయే అవకాశం ఉంది. అలాగే భద్రతా కోణం నుంచి కూడా ఇది సరైనది కాదు. దీన్ని గూగుల్లో ఎప్పుడూ సెర్చ్ చేయవద్దు.

సెర్చ్ చేయకూడని మరిన్ని విషయాలు ఇవే…

గూగుల్లో ఎలాంటి నేర కార్యకలాపాల గురించి శోధించవద్దు. అలాగే అత్యాచార బాధితురాలి పేరును కూడా వెతకకూడదు. ఇక నుంచి గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మనం ప్రమాదంలో పడకుండా ఉంటుంది.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...