ఏటిఎం కార్డులు అవసరం లేదు.. నవ్వుతే డబ్బులు వస్తాయి..

Date:

బ్యాంకింగ్ రంగం అంతా డిజిటల్ మయంగా మారింది. సింపుల్ క్లిక్‌తో భారీ ట్రాన్సాక్షన్లు కూడా పూర్తి చేయగలుగుతున్నాం. అయితే కొన్ని బ్యాంకులు ఇంతకంటే మరింత సులభమైన పేమెంట్ మెథడ్స్‌ తీసుకొస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ స్మైల్‌పే అనే ఒక కొత్త రకం పేమెంట్ మెథడ్ తీసుకొచ్చింది. దీంతో పేమెంట్స్‌ చేయాలంటే కార్డులు లేదా ఫోన్లు అవసరం లేదు. ఈ సర్వీస్ కస్టమర్ ముఖాన్ని చూసి, గుర్తించి, పేమెంట్ పూర్తి చేస్తుంది. అంటే, కస్టమర్ నవ్వుతూ కెమెరా ముందు నిలబడితే చాలు, డబ్బు చెల్లించవచ్చు.

*స్మైల్‌పే ప్రత్యేకతలు*

ఫెడరల్ బ్యాంక్ 2024, ఆగస్టు 29న స్మైల్‌పై సేవలను ప్రారంభించింది. ఇది భారతదేశంలోనే మొదటి ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ సిస్టమ్. UIDAIకి చెందిన భీమ్ ఆధార్‌పే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు కేవలం ఫేస్‌ను స్కాన్ చేస్తే చాలు, పేమెంట్ జరిగిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా సులభం. కేవలం రెండు స్టెప్స్‌లో ట్రాన్సాక్షన్లు కంప్లీట్ అవుతాయి. “మనం డబ్బు, కార్డులు, క్యూఆర్ కోడ్స్‌, వేరే డివైజ్‌లతో పేమెంట్స్ చేసేవాళ్లం. ఇప్పుడు కేవలం నవ్వుతూ ఉంటే చాలు డబ్బు చెల్లించవచ్చు. ఇది కస్టమర్లకు చాలా ఆసక్తికరమైన అనుభవం” అని ఫెడరల్ బ్యాంక్‌ సిడిఓ ఇంద్రనీల్ పండిట్ చెప్పారు.

*ఫీచర్స్, బెనిఫిట్స్*

ఫెడరల్ బ్యాంక్ తీసుకొచ్చిన స్మైల్‌పే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డబ్బు, కార్డులు లేదా ఫోన్లు అవసరం లేదు. కేవలం ఫేస్‌ చూపిస్తే చాలు. దీంతో వ్యాపారులు త్వరగా డబ్బు వసూలు చేయొచ్చు. ఇది UIDAI ఫేస్‌ అథెంటికేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ట్రాన్సాక్షన్లను పూర్తి చేస్తుంది.

*అవైలబిలిటీ, ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్*

స్మైల్‌పే సర్వీస్, మొదట ఫెడరల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వాళ్లకే లభిస్తుంది. అంటే, షాపు యజమాని కూడా, షాపింగ్ చేసే వాళ్లు కూడా ఫెడరల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండాలి. కానీ, బ్యాంక్ త్వరలోనే ఇంకా ఎక్కువ మందికి ఈ సర్వీసు అందించాలని, ఇతర కంపెనీలతో కలిసి పని చేయాలని అనుకుంటుంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్, “స్వతంత్ర మైక్రో ఫైనాన్స్” కంపెనీలతో కలిసి కొన్ని చోట్ల ఈ పద్ధతిని ప్రయోగించారు.

* పేమెంట్స్ చేసే ప్రాసెస్*

ఫెడరల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండి ఫెడ్ మెర్చంట్ యాప్‌ని ఉపయోగిస్తున్న వ్యాపారుల వద్ద ఈ స్మైల్ పే పేమెంట్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఏదైనా సరుకులు కొన్నప్పుడు, వ్యాపారి కస్టమర్ ఆధార్ కార్డు నంబర్‌ని ఆ యాప్‌లో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఫేస్ కెమెరాతో స్కాన్ చేస్తారు. అదే వ్యక్తి అని కన్ఫర్మ్ అయ్యాక కస్టమర్ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అయి వ్యాపారి ఖాతాలో జమ అవుతుంది. ఈ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత యాప్‌లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మర్చంట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అయితే స్మైల్ పే ద్వారా సింగిల్ పేమెంట్‌లో గరిష్టంగా రూ.5,000 మాత్రమే పంపించగలరు. ఒక నెలలో మొత్తం స్మైల్ పే ద్వారా 50,000 రూపాయలకు మించి పంపించలేరు.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...