ఒక వ్యక్తి పాము కాటుకు గురై మరణించాడు. వెంటనే పామును చంపిన గ్రామస్థులు ఆ వ్యక్తి చితిమీదనే పేర్చి పామును కూడా దహనం చేశారు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్ కోర్బా జిల్లాలో జరిగింది. శనివారం 22 ఏళ్ల దిగేశ్వర్ రథియా అనే వ్యక్తిని ఓ విషపూరిత పాము కాటు వేసింది. బైగామర్ గ్రామంలో అతను ఇంట్లో రాత్రి పడుకునే సమయంలో పాము కాటుకు గురయ్యాడు. అయితే అతన్ని కోర్బా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి.. ఆదివారం ఉదయం మరణించారు. ఈలోగా ఇంట్లో కాటేసిన పామును స్థానికులు పట్టుకున్నారు.
ఆదివారం ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో.. పామును అతని చితిమీద పేర్చారు. ఆ మంటల్లో పామును కాలి బూడిదైంది. మరెవరినైనా కాటు వేస్తుందో అన్న భయంతో.. గ్రామస్థులు దాన్ని పట్టుకుని .. చితిమంటల్లో వేసేశారు. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో పామును తాడుకు కట్టేసి లాక్కెళ్లుతున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దిగేశ్వర్ ఇంటి నుంచి అతన్ని దహనం చేసిన ప్రదేశం వరకు పామును కూడా లాక్కెళ్లారు. ఆ వ్యక్తి చితిమంటల్లోనే ఆ సర్పం సజీవంగా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల కోర్బా సబ్ డివిజినల్ ఆఫీసర్ అశిష్ ఖేల్వార్ స్పందించారు. పామును చంపిన గ్రామస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమన్నారు. పాములు, పాము కాటుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఆశిష్ ఖేల్వార్ తెలిపారు.