బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్తే ప్రమాదం తప్పే అవకాశముంటుందని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఇప్పటికే సల్మాన్‌కు సలహా ఇచ్చారు.
”బిష్ణోయ్ తెగతో సల్మాన్ ఖాన్‌కు ఎప్పటి నుంచో వివాదం ఉన్న విషయం తెలిసిందే. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు. ఒక తెగ నమ్మకాలకు సంబంధించినది. అందుకే సల్మాన్ ఇప్పటికైనా బిష్ణోయ్‌లకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి, గతంలో తాను చేసిన తప్పునకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. దీని వల్ల వారిలో ఆయనపై ఉన్న కోపం పోతుంది. లేదంటే ఈ సమస్య ఇంతటితో ఆగదు. ఆయన ప్రాణాలకు ముప్పు తెస్తుంది” అని టికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. వారు (లారెన్స్ గ్యాంగ్) దుర్మార్గులని.. జైల్లో ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్నారు. అతడు ఎప్పుడు ఎవరికి, ఏ రకంగా హానీ తలపెడతాడో తెలియదని.. క్షమాపణ కోరితే విభేదాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చని సల్మాన్‌కు సూచించారు.