రోడ్లు ఊడ్చే ఉద్యోగాల‌కు డిగ్రీ, పిజీ అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు

Date:

హ‌ర్యానా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి. తాజాగా స్వీపర్‌ ఉద్యోగాల కోసం హెచ్‌కేఆర్‌ఎన్‌ ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 వరకు ఏకంగా 39,990 మంది పట్టభద్రులు, 6,112 మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన మరో 1,17,144 మంది సైతం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇంతలా పోటీ ఉండేందుకు ఇవేమీ ప్రభుత్వం కల్పించే శాశ్వత ఉద్యోగాలు సైతం కావు. జీతం కూడా భారీగా ఏమీ లేదు. కేవలం రూ.15 వేల నెలవారీ వేతనంతో ఇచ్చే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవి. పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఉద్యోగ ప్రకటనలోనే ఉద్యోగ బాధ్యతలు, చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరిచారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఊడ్చడం, శుభ్రం చేయడం, చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్నారంటే బీజేపీ పాలిత హర్యానాలో, దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి.

Share post:

Popular

More like this
Related

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...

విద్యుత్ అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చెయ్యండి

ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి. ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం అందుబాటులో ఉండాలి.....

జూనియ‌ర్ వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్ కాదు

పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన...