45ఏళ్ల తర్వాత పోలెండ్ చేరుకున్న మోడీ

Date:

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలెండ్‌ చేరుకున్నారు. భారత్‌, పోలెండ్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత 45ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పోలెండ్‌ను సందర్శించారు.

రెండు రోజులపాటు పోలెండ్‌లో పర్యటించనున్న మోడీ.. అక్కడ నుంచి ఉక్రెయిన్‌ వెళ్లనున్నారు. ఆగస్టు 23న ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు ప్రయాణించి కీవ్‌ చేరుకుంటారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలెండ్‌ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొస్తారు. తన విదేశీ పర్యటన రెండు దేశాలతో విస్తృతమైన సంబంధాలకు ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైన బంధాన్ని నెలకొల్పడానికి దోహదపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు భారత్‌ నుంచి బయలుదేరే సమయంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం వేళ ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Share post:

Popular

More like this
Related

ఆ గ్రామంలో ప్ర‌తి ఇంటిలో ఓ ఉపాధ్యాయుడు

దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కొన్ని గ్రామాల‌కు కొంత చరిత్ర ఉంది.....

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో...

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన హింస

మ‌ణిపూర్‌లో మళ్లీ గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. రాష్ట్రంలో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. జిరిబామ్...

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...