Saturday, November 9, 2024
Homeజాతీయం2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం

2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం

Date:

కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతలో భాగంగా దేశవ్యాప్తంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనతోపాటు సంబంధిత పథకాలను కేంద్రం పొడిగించింది. 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటి కోసం రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

పీఎంజీకేఏవైతోపాటు పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. లోథాల్‌లో ‘నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌’ అభివృద్ధికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దుల్లో రూ.4,406 కోట్లతో 2280 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి అంగీకరించింది.