14ఏళ్లకే ఒలింపిక్స్ క్రీడల్లో అవకాశం

Date:

2024 పారిస్ ఒలింపిక్స్‌ లో భారత జట్టు నుంచి 117 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఒకటి. స్విమ్మర్ ధినిధి కేవలం 14 సంవత్సరాల వయస్సులో అతిపెద్ద క్రీడల వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. యూనివర్సాలిటీ కోటా సహాయంతో ధీనిధికి పారిస్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఒకప్పుడు నీళ్లలో కాలు పెట్టాలంటే కూడా భయపడే ధినిధి పారిస్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ధీనిధి కేవలం మూడు సంవత్సరాల వయస్సులో ఈత కొట్టడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ధినిధికి మాట్లాడటం కూడా కష్టంగా ఉంది. దానివల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం పెరగలేదు. ఈ కారణంగానే కుటుంబం ఎలాగైనా క్రీడల్లో చేర్చాలని నిర్ణయించుకుంది. ధినిధికి మొదట్లో నీటిలోకి వెళ్లడం ఇష్ట పడలేదు.

జాతీయ క్రీడల్లో ధీనిధి ఏడు బంగారు పతకాలు సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డ్ సృష్టించింది. 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ లో జాతీయ రికార్డు నెలకొల్పింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కూడా పాల్గొంది. ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కూడా పాల్గొంటుంది.

Share post:

Popular

More like this
Related

ఆ గ్రామంలో ప్ర‌తి ఇంటిలో ఓ ఉపాధ్యాయుడు

దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కొన్ని గ్రామాల‌కు కొంత చరిత్ర ఉంది.....

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో...

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన హింస

మ‌ణిపూర్‌లో మళ్లీ గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. రాష్ట్రంలో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. జిరిబామ్...

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...