హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఎక్కువ మ‌ర‌ణాలు

Date:

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డు ప్ర‌మాదాల్లో ఎక్కువ మ‌ర‌ణాల‌కు ప్ర‌ధాన కార‌ణం హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే అనేకమంది మరణిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ద్విచక్ర వాహన తయారీదారులు వాహన కొనుగోలుదారులకు తగ్గింపు ధర లేదా సహేతుకమైన ధరలకు హెల్మెట్లను అందించాలని కోరారు. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ”2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 50,029మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల, ద్విచక్ర వాహన తయారీదారులకు నా అభ్యర్థన ఏంటంటే.. వాహనం కొనుగోలు చేసేవారికి హెల్మెట్‌లపై కొంత డిస్కౌంట్‌ ఇవ్వగలిగితే ప్రజల ప్రాణాల్ని కాపాడగలం అనిపించింది” అన్నారు.

పాఠశాల బస్సులకు కూడా పార్కింగ్‌ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్లాన్‌ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీగా ఫైన్‌లను అమలు చేసిందన్న ఆయన.. నిజానికి దీన్ని సమర్థంగా అమలుచేయడం కూడా పెద్ద సవాల్‌గా ఉందన్నారు. దేశంలోని ప్రతి తాలుకాలో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించాలన్నది తన ఆశయమని తెలిపారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...