హాథ్రాస్ కేసును నిరాక‌రించిన సుప్రీంకోర్టు

Date:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన‌ హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇటువంటి కేసులు దేశ ప్రజలను కలవరపెడుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జె.బి.పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ, ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

జులై 2న జరిగిన హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్‌ విశాల్ తివారీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందించడానికి వైద్యశాలలు అందుబాటులో లేకపోవడం దేశంలో ఉన్న పెద్ద సమస్యగా పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ సమస్యపై సుప్రీం దృష్టిపెట్టాలని కోరగా, సీజేఐ దీనిని తిరస్కరించారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...