Saturday, December 7, 2024
Homeజాతీయంసుప‌రిపాల‌నకు ప్ర‌జ‌లు అందించిన విజ‌యం

సుప‌రిపాల‌నకు ప్ర‌జ‌లు అందించిన విజ‌యం

Date:

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌తలు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై ఆయ‌న‌ స్పందించారు. మహాయుతి కూటమికి ఆయన అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్ని విజయ తీరాలను చేరాలని ఆయన ఆకాంక్ష వెలిబుచ్చారు.

ఇది అభివృద్ధి విజయమని, సుపరిపాలన సాధించిన గెలుపని, సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతామని ప్రధాని మోదీ అన్నారు. మాకు ఇంతటి చారిత్రక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రగతికి అహరహం పాటుపడుతామని బీజేపీ హామీ ఇస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కూటమి 220కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కేవలం 50 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు ఐదు స్థానాల్లో గెలిచారు.