వినేట్ ఫొగాట్‌ను రాజ్యసభకు పంపిద్దాం..?

Date:

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌కు ‘అనర్హత’ రూపంలో షాక్‌ తగిలింది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు దేశమంతా అండగా నిలిచింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా ఒక అడుగు ముందుకు వేసి, ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేయాలన్నారు.

అలాగే ఆయన కుమారుడు దీపిందర్‌ సింగ్ హుడా కూడా ఇదే తరహాలో స్పందించారు. ”ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఆట నుంచి వైదొలగాల్సి వచ్చినప్పటికీ.. కోట్లాది మంది ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. క్రీడా వ్యవస్థ ఓడిపోయింది. బంగారు పతక విజేతలకు ఇచ్చే సౌకర్యాలనే ఆమెకు కల్పించాలి. ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఆమే ఈ పదవికి తగిన వ్యక్తి” అని దీపిందర్ హుడా అన్నారు.

దీనిపై వినేశ్ పెదనాన్న మహవీర్ ఫొగాట్‌ స్పందించారు. ”మరి భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గీతా ఫొగాట్‌ (మహవీర్‌ కుమార్తె)ను ఎందుకు రాజ్యసభకు పంపలేదు..?” అని ప్రశ్నించారు. ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అనర్హతకు గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ”తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా” అని పేర్కొంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురికావడం ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...