రెండు నెలల పాటు జీతభత్యాలు వద్దు..

Date:

హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి విపత్తుతో అల్లకల్లమయింది. ఆ రాష్ట్రానికి అండగా నిలిచేందుకు సీఎం, మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల పాటు జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అందులో చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు భాగంకానున్నారు. ఈ ప్రకటన చేసింది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అల్లకల్లోలమైంది. ఆగస్టు నెలలో కులు, మండి, శిమ్లా జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. జూన్‌ 27 నుంచి ఆగస్టు 9 మధ్యలో 100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దాంతో రోజువారీ కార్యకలాపాలతో పాటు పర్యటకంపై ప్రభావం పడింది.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...