Saturday, December 7, 2024
Homeజాతీయంమోడీ సంప‌న్నులు చెప్పిన‌ట్లు వింటారు

మోడీ సంప‌న్నులు చెప్పిన‌ట్లు వింటారు

Date:

బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ప్ర‌ధాని మోడీ ప‌నిచేస్తున్నార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష కూటమి పోరాడుతుంటే, భాజపా మాత్రం దాన్ని చెత్తబుట్టలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ”రాహుల్‌ రెడ్‌బుక్‌ చూపెడుతున్నారని ప్రధాని మోడీ చెబుతున్నారు. దాని రంగు ముఖ్యం కాదు, అందులో ఉన్న కంటెంట్‌ ముఖ్యం. దాన్ని చదివి ఉంటే, విద్వేషం వ్యాప్తి, సమాజాన్ని విభజించే ప్రయత్నం చేయరు. ఇది విపక్షకూటమి, భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య జరుగుతోన్న పోరాటం. మేము రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతుంటే, కులం, మతం ఆధారంగా విద్వేషాలతో సమాజాన్ని విభజించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు” అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

56 అంగుళాల ఛాతీ కలిగిన (మోదీని ఉద్దేశిస్తూ) వ్యక్తికి తాను భయపడనని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆయన సంపన్నులు చెప్పినట్లు వింటారనన్నారు. పగటి వేళ పేదల గురించి మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో మాత్రం పారిశ్రామికవేత్తల వివాహాలకు హాజరవుతారని ఆరోపించారు. ఇక మహారాష్ట్రలో భూమిని లాక్కోవడానికే ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, ముంబయి ధారావిలో రూ.లక్ష కోట్ల విలువైన భూమిని ఓ పారిశ్రామికవేత్తకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.