మహిళ రోగులతో డాక్టర్ అసభ్యప్రవర్తన..

Date:

ఓ డాక్టర్‌ బాధ్యత మరిచి మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ ఆసుపత్రికి ఇద్దరు మహిళలు చెకప్‌ కోసం వెళ్లారు. అక్కడ ఉన్న ఓ వైద్యుడు వారికి ఈసీజీ తీయాలంటూ లోనికి పిలిచాడు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో మహిళతోనూ ఇలాగే ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుల బంధువులు వైద్యుడిపై దాడికి దిగారు. అంతా కలిసి అతడిని చావ బాదారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తీవ్ర గాయాల పాలైన వైద్యుడిని అదే అస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనిల్‌ మిశ్రా తెలిపారు. బాధితులు సహా నిందితుడు చికిత్స పొందుతుండడంతో వారు కోలుకున్న అనంతరం వారి వాంగ్మూలం నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...