Saturday, December 7, 2024
Homeజాతీయంమ‌హారాష్ట్ర‌లో అమిత్ షా హెలికాప్ట‌ర్ త‌నిఖీ

మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా హెలికాప్ట‌ర్ త‌నిఖీ

Date:

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన అమిత్ షా హెలికాప్ట‌ర్‌ను ఎన్నిక‌ల అధికారులు త‌నిఖీ చేశారు. హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన స‌మ‌యంలో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన.. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ”ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను భాజపా విశ్వసిస్తోంది. ఇందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి” అని అమిత్‌ షా పేర్కొన్నారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం ఇటీవల చర్చనీయాంశమైంది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. దాంతో ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ కూడా క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి బ్యాగులు, హెలికాప్టర్ల తనిఖీల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాగులను అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో నవంబర్‌ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.