Saturday, December 7, 2024
Homeజాతీయంభార‌త్‌లో భారీగా పెరుగుతున్న పాము కాటు మ‌ర‌ణాలు

భార‌త్‌లో భారీగా పెరుగుతున్న పాము కాటు మ‌ర‌ణాలు

Date:

ప్రపంచవ్యాప్తంగా పాముకాటు కారణంగా సంభవిస్తున్న మరణాల రేటులో భారత్‌లో అత్యధికంగా ఉన్నది. ఓ అంచనా ప్రకారం ఏటా 45,900 నుంచి 58వేల మంది వరకు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. పాముకాటు కేసులు, మరణాలను ‘నోటిఫై చేయదగిన వ్యాధి’గా మార్చాలని సూచించారు. దాంతో ఒకపై పాముకాటు మరణాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రానున్నది.

2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2030 నాటికి పాముకాటు మరణాల నివారణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. పాముకాటుతో మరణంతో పాటు వైకల్యానికి దారి తీస్తుందని కార్యదర్శి పేర్కొన్నారు. రైతులు, గిరిజనులు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. పాముకాటు కేసులు, మరణాలను నిఘాను పెంచడమే ప్రణాళిక ప్రధాన లక్ష్యమని చెప్పారు. పాముకాటు వ్యాధులు, మరణాలను ప్రజారోగ్య చట్టం.. ఇతర వర్తించే చట్టం ప్రకారం.. ‘నోటిఫై చేయదగిన వ్యాధులు’గా మార్చాలని అభ్యర్థించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలు (మెడికల్ కాలేజీలతో సహా) పాముకాటు కేసులు, మరణాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.