Saturday, December 7, 2024
Homeజాతీయంభర్తని నపుంసకుడు అని పిలవడం క్రూరత్వమే

భర్తని నపుంసకుడు అని పిలవడం క్రూరత్వమే

Date:

పెళ్లి చేసుకున్న భర్తను నపుంసకుడు అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్‌ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది.

ఈ జంటకు 2017లో వివాహం జరిగింది. తన భార్య చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుందని, తన తల్లిని మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్ లోకి భోజనం పంపమని అడిగేదని, తన తల్లి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా.. రోజుకు నాలుగైదు సార్లు పైకి పిలిచేదని భర్త కోర్టు తెలిపాడు. తన భార్య పోర్న్ చూడటం అలవాటు చేసుకుందని, శారీరకంగా ఫిట్‌గా లేనని తనను వెక్కిరించేదని, వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుందని చెప్పాడు.

భర్త ఆరోపణల్ని భార్య కొట్టిపారేసింది. తాను పోర్న్ చూస్తున్నానని ఎలాంటి సాక్ష్యం లేదని, తన అత్తమామలు తనకు మత్తు మందు ఇస్తున్నారని కూడా ఆరోపించింది. తన క్లయింట్‌పై భర్తే క్రూరత్వానికి పాల్పడినట్లు మహిళ తరుపున వాదిస్తున్న లాయర్ కోర్టుకు తెలిపాడు. అయితే, సదరు వ్యక్తి తల్లి తన కొడుకు నపుంసకుడు అని పిలిచేదని సాక్ష్యం చెప్పింది. భార్య తనకు మత్తు మందు ఇస్తున్నారనే వాదనకు రుజువులు చూపించలేకపోయింది. ఇద్దరు ఆరేళ్లుగా కలిసి లేరని, ఈ వివాహం పనికిరాకుండా పోయిందని, పూర్తిగా చనిపోయిందని, తిరిగి కలిసి ఉండాలని ఆదేశించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని కోర్టు పేర్కొంది.