బెంగాల్ మహిళలకు సురక్షితమైన రాష్ట్రం కాదు

Date:

మహిళలకు సురక్షితమైన ప్రదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాదని గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ అన్నారు. సమాసంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నారని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆర్‌జీ ఖర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి ఘటనపై ఆయన స్పందించారు. బాధితురాలి తల్లి మనోభావాలను తాను గౌరవిస్తానన్నారు. రక్షా బంధన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో మహిళా నేతలు, వైద్యులతో గవర్నర్‌ సమావేశమయ్యారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని.. ఇది ఇకపై కొనసాగదన్నారు. మన ఆడబిడ్డలను, సోదరీమణులను కాపాడుకుంటామని ప్రమాణం చేయాలన్నారు. మహిళలు సంతోషంగా, సురక్షితమని భావించే సమాజం ఉండాలన్నారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...