ప్రతి రెండు గంటలకు నివేదిక ఇవ్వండి..

Date:

కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం, మద్దతు లేకపోవడం, పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును కోర్టు సీబీఐకు అప్పగించిందని పేర్కొంది. 

ఈ ఘటన నేపథ్యంలో ఇటీవల దేశంలో అన్ని వైద్యకళాశాలలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ స్థాయిలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, కళాశాల, ఆసుపత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఈ రక్షణ చర్యలు.. ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్‌, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండేలా చూడాలని తెలిపింది. వైద్యులు, సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలోనూ భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటుచేయాలని పేర్కొంది.

Share post:

Popular

More like this
Related

వినూత్న కథాంశంతో మైక్రో ఫిల్మ్ దిక్సూచి

స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలే ప్ర‌ధాన అంశంగా వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...