Saturday, December 7, 2024
Homeజాతీయంపొగ మంచులో దేశ రాజ‌ధాని ఢిల్లీ

పొగ మంచులో దేశ రాజ‌ధాని ఢిల్లీ

Date:

వాయు కాలుష్యం పొగ మంచులో దేశ రాజధాని ఢిల్లీ మునిగిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 473గా నమోదైంది. గురువారం ఉదయం రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. రోడ్లపై వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఉదయం 9 గంటల సమయంలోనూ సూర్యుడు కనిపించని పరిస్థితి. విజిబిలిటీ జీరోకు పడిపోవడంతో విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌ పోర్ట్‌కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్‌ రాడార్‌ 24 సంస్థ తెలిపింది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. మొత్తం ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, రాజధాని నుంచి బయలుదేరాల్సిన 226 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్‌ రాడార్‌ 24 సంస్థ తెలిపింది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.