పేపర్లో చూసి ఆంటీ రేప్‌ అంటే ఏమిటి అని అడిగిన రెండు రోజులకే..

Date:

అస్సాంలో ఒక హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితమే కోల్‌కతా అత్యాచార ఘటనను పేపర్లో చదివి అత్యాచారం అంటే ఏమిటని పదవ తరగతి బాలిక తన బంధువును అడిగిందట. అడిగిన రెండు రోజులకే పదోతరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు తనకే అలాంటి ఆ పరిస్థితి ఎదురుకావడం ప్రతిఒక్కరినీ బాధిస్తోంది.

”పశ్చిమ బెంగాల్‌ ఘటన గురించి పేపర్‌లో చదివి.. ‘ఆంటీ రేప్‌ అంటే ఏమిటి..?’ అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆమెను రక్షించడంలో నేను విఫలమయ్యానని అనిపించింది. డీఎస్పీ కావాలని కలగంది. తనను కలిసేందుకు ఆసుపత్రికి డీఎస్పీ వస్తే అంత కష్టంలోనూ ముఖం మీద నవ్వునే ప్రదర్శించింది” అని ఆమె బంధువు మీడియాకు వెల్లడించారు. బాలిక తండ్రి గువాహటిలో ఉంటారు. ఆయనకు తన కుమార్తెను చదివించే స్థోమత లేక ఈ బంధువు వద్దకు పంపారు. ”ఆ స్థితిలో నా కుమార్తెను చూసిన తర్వాత.. నా గుండె ముక్కలైంది. కనీసం నాతో మాట్లాడలేకపోయింది” అని బాలిక తండ్రి వాపోయారు. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. 

అస్సాంలోని నాగావ్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక ట్యూషన్‌ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. ఆ దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. గాయాలపాలై, అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి రక్షించారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలికి చికిత్స అందుతోంది. ఈ సమయంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతడిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. దర్యాప్తు చేస్తుండగా నిందితుడు ప్రాణభయంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులోకి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతడిని ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

Share post:

Popular

More like this
Related

మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించండి

దేశంలో మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు...

వినూత్న కథాంశంతో మైక్రో ఫిల్మ్ దిక్సూచి

స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలే ప్ర‌ధాన అంశంగా వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...