నెలసరి సెలవుల వల్ల మహిళలకే నష్టం

Date:

దేశంలో మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్లో 1992 నుంచీ నెలకు రెండు రోజుల పాటు మహిళలకు ఈ సెలవు ఇస్తున్నారు. కేరళలోనూ నెలకు మూడు రోజుల పాటు విద్యార్ధినులకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ మహిళలు, విద్యార్ధినులకు నెలసరి సెలవులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ దీని వల్ల వారిపై పడే ప్రభావాన్ని గుర్తుచేసింది. ముఖ్యంగా మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారి ఉపాధి అవకాశాలపై ప్రభావం పడొచ్చని తెలిపింది. నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

మహిళల ప్రయోజనాల కోసం తాము చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని అత్యున్నత న్యాయస్ధానం గుర్తు చేసింది. కాబట్టి ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. దీనిపై కేంద్రాన్ని ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. అలాగే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి దీనిపై ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని సుప్రీంకోర్టు సలహీ ఇచ్చింది.

Share post:

Popular

More like this
Related

కొండా లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ మ‌ర‌వ‌దు

కేసీఆర్‌ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్థలం ఇచ్చి, నిలువ...

మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించండి

దేశంలో మంకీపాక్స్ అనుమానితుల‌ను గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు...

వినూత్న కథాంశంతో మైక్రో ఫిల్మ్ దిక్సూచి

స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలే ప్ర‌ధాన అంశంగా వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...