నెల‌కు రూ.300కే ఇంట‌ర్‌నెట్‌, కేబుల్ టీవీ

Date:

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్‌ ప్రాజెక్టును భారత్‌ నెట్‌ ఫేజ్‌-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాలకు నెట్‌వర్క్‌ కల్పించడమే టీ ఫైబర్‌ లక్ష్యమన్నారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.

”పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తాం. నెలకు రూ.300కే ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ, ఈ- ఎడ్యుకేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. టీ-ఫైబర్‌ అమలుకు ఎన్‌ఎఫ్‌ఓఎన్‌ సహకారం అవసరం. భారత్‌ నెట్‌ పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలి. టీ-ఫైబర్‌కు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలి” అని సీఎం కోరారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...