నూతన చట్టాలతో సత్వర న్యాయం

Date:

దేశంలో నూతన నేర న్యాయ చట్టాల అమలు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. స్వాతంత్రం సిద్ధించిన 77 ఏండ్ల తర్విఆత మన నేర న్యాయ వ్యవస్ధ పూర్తిగా స్వదేశీగా మారిందని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. భారతీయ విలువల ఆధారంగా నూతన చట్టాలు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. వలసవాద చట్టాలకు పాతరేసి భారత పార్లమెంట్‌లో రూపొందిన చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు.

దండనకు బదులు ఇప్పుడు న్యాయం అందుబాటులోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నూతన చట్టాల అమలుతో జాప్యాలకు చెల్లుచీటీ సాధ్యమై విచారణ వేగవంతమై సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. గత చట్టాల హయాంలో కేవలం పోలీసుల హక్కులే కాపాడబడేవని, నూతన చట్టాల రాకతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కుల పరిరక్షణకు వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. ఈ క్రమంలో నూతన చట్టాల కింద దేశ రాజధాని ఢిల్లీలో తొలి కేసు నమోదయింది. 

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...