నా చిత్రానికి సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డం లేదు

Date:

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తమ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ఇంకా సర్టిఫికేట్‌ ఇవ్వలేదని కంగన తాజాగా తెలిపారు. త్వరలోనే మా సినిమా సెన్సార్‌ పూర్తి అవుతుందని ఆశిస్తున్నా. మేం సర్టిఫికేట్‌ కోసం వెళ్లిన రోజు కొంత మంది డ్రామా క్రియేట్‌ చేశారు. సెన్సార్‌ బోర్డులోనూ చాలా సమస్యలు ఉన్నాయి. అనుకున్న సమయానికి మా సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నా. సెన్సార్ సర్టిఫికేట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నా. వాళ్లు సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదు. నా సినిమా కోసం నేను పోరాటం చేయడానికి సిద్ధం. ఇందు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా” అని కంగన తెలిపారు. ఈ సినిమా విషయంలో చిత్రబృందానికి వస్తోన్న బెదిరింపులను ఉద్దేశించి ఆమె కామెంట్‌ చేశారు. ”మమ్మల్ని బెదిరించినంత మాత్రాన చరిత్ర ఏమీ మారిపోదు” అని అన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. కంగనా రనౌత్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 6న ఇది విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో తమని తప్పుగా చూపించారని ఒక వర్గం వారు ఆరోపించారు. ఈ సినిమా రిలీజ్‌పై బ్యాన్‌ విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు వచ్చాయి. ఇందులో సంజయ్‌ గాంధీగా నటించిన విశాక్‌ నాయర్‌ సైతం తాజాగా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ”ఈ చిత్రంలో నేను జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పాత్ర పోషించానని భావించి కొంతమంది నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంపేస్తామంటూ కొన్ని రోజులుగా సందేశాలు వస్తున్నాయి. నేను చెప్పేది ఒక్కటే.. ఇందులో నేను సంజయ్‌ గాంధీ రోల్‌ పోషించా. ఒక్కసారి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...