తెలంగాణ బడ్జెట్ రూ.2,91,159కోట్లు

Date:

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

రాష్ట్ర బడ్జెట్‌ స్వరూపమిదీ..

  • ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు
  • ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు
  • రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు
  • వ్యవసాయానికి రూ.72,659 కోట్లు
  • ఉద్యానశాఖకు రూ.737కోట్లు
  • పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు
  • రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు
  • గృహజ్యోతికి రూ.2,418కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు
  • రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌)కు రూ.1,525 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ.17,056కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు
  • వైద్య, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
  • ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు
  • అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు
  • నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు
  • విద్యకు రూ.21,292 కోట్లు
  • హోంశాఖకు రూ.9,564కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...