Saturday, December 7, 2024
Homeజాతీయంచ‌త్తీస్‌గ‌ఢ్ నీటిలో ప్ర‌మాద‌క‌ర‌మైన యురేనియం

చ‌త్తీస్‌గ‌ఢ్ నీటిలో ప్ర‌మాద‌క‌ర‌మైన యురేనియం

Date:

ఛత్తీస్‌గఢ్‌లోని 6 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ”యురేనియం” ఉందని తేలింది. అణు కార్యక్రమాల్లో ఉపయోగించి యూరేనియం మోతాదుకి మించి నీటిలో ఉండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక లీటర్‌నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమిత, ప్రభుత్వం ప్రకారం లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాములతో పోలిస్తే ఈ నీటిలో యురేనియా మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంది. నీటిలో ఈ స్థాయిలో యురేనియం ఉండటం ప్రజల్లో క్యాన్సర్లు, ఊపిరితిత్తుల రోగాలు, చర్మ, మూత్రపిండాల వ్యాధులకు కారణం అవుతుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, కంకేర్, బెమెతర, బలోడ్, కవార్ధా ప్రాంతాలలోని తాగు నీటి నమూనాల పరీక్షలలో లీటరుకు 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ యురేనియం స్థాయిలు కనుగొనబడ్డాయి. 2017లో డబ్ల్యూహెచ్‌ఓ లీటర్ నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమితికి మించకూడదని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ భారత్‌ లాంటి కొన్ని దేశాల్లో ఈ పరిమితిని రెట్టింపు చేసింది. జూన్‌లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం లీటరుకు 60 మైక్రోగ్రాములు కూడా సురక్షితమని సూచించింది.