గూగుల్ మ్యాప్‌తో మీరు స‌హాయ‌ప‌డ‌వ‌చ్చు..

Date:

ఏదైనా తెలియ‌ని కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే చాలా మంది గూగూల్ మ్యాప్స్‌ను వాడుతారు. గూగుల్ మ్యాప్ సాయంతో ప్ర‌యాణం చేస్తారు. రద్దీగా ఉన్న మార్గాలను హైలెట్‌ చేస్తూ, ఫ్లై ఓవర్‌ల గురించి డిస్‌ప్లే చేయడం వంటి ఫీచర్లను మ్యాప్స్‌ అందిస్తుంది. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగే ప్రమాదాల కారణంగా రోడ్డు రద్దీ, హెచ్చరికలు వంటి సమస్యలు తెలుసుకోవాలంటే కష్టం. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. దీని సాయంతో వినియోగదారులే హెచ్చరికలు జారీ చేస్తూ ఇతరులకు సాయం చేయొచ్చు.

ప్రమాదాలు, ఏదైనా కారణంగా రోడ్డుపై ప్రయాణాన్ని మళ్లించడం, పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో వాహనాలు నిలిచిపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. వీటి గురించి యూజర్లే స్వయంగా అప్‌డేట్‌ అందించేలా ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది. అంటే ఇకపై రోడ్డు ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యల గురించి అయినా.. అదే మార్గంలో ప్రయాణించాలనుకొనే ఇతర యూజర్లను అప్రమత్తం చేయొచ్చు. దీంతో అటువైపుగా ప్రయాణించాలనుకొనే వారు వేరే మార్గాల్ని ఎంచుకునే సౌలభ్యం కలుగుతుంది. సమయం ఆదా అవుతుంది.

ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగించాలంటే..

గూగుల్‌ మ్యాప్స్‌లో మీరు చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్‌ చేయాలి.
నావిగేషన్‌ ప్రారంభించాక, కింద కనిపించే బార్‌ను స్వైప్‌ చేయాలి.
అందులో ‘Add a report’ అని కనిపించే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
అందులో క్రాష్‌, రోడ్‌ వర్క్స్‌, లేన్‌ క్లోజర్‌.. అంటూ అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఎదురైన సమస్యను ఎంచుకొని రిపోర్ట్‌ చేయాలి.
మీ రిపోర్ట్‌ని కన్ఫార్మ్‌ చేయగానే అటువైపుగా వచ్చే ఇతర యూజర్లను మ్యాప్స్‌ అప్రమత్తం చేస్తుంది.
ఏఐ ఫీచర్లు..

గూగుల్‌ మ్యాప్స్‌ తన యూజర్ల కోసం తాజాగా ఏఐ సదుపాయంతో సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దీని సాయంతో రహదారుల వెడల్పును అంచనా వేయొచ్చు. దీంతో నాలుగు చక్రాల వాహన దారులకు రోడ్లు మార్గం ఎంచుకోవడం సులభం కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ రోలవుట్‌ అవుతోంది.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...