కోల్‌క‌తా నిందితుడి త‌ర‌పున ఎవ‌రూ వాదించొద్ద‌ని నిర‌స‌న‌

Date:

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నిందితుడి తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. ఇలాంటి పరిణామాల నడుమ ఓ మహిళా న్యాయవాది క‌వితా స‌ర్కార్‌ నిందితుడి తరఫున వాదనలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

కేసు ఎంతటి తీవ్రమైనదైనా సరే.. పారదర్శక విచారణ కోసం నిందితుడి వాదనలు వినడం కూడా ముఖ్యమే. దీన్ని పరిగణనలోకి తీసుకునే ఇటీవల కోర్టు లీగల్‌ ఎయిడ్‌కు సిఫార్సులు చేసింది. దీంతో సంజయ్‌ రాయ్‌ కోసం వాదించే బాధ్యతలను కోల్‌కతాకు చెందిన మహిళా న్యాయవాది కవితా సర్కార్‌కు అప్పగించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఎవరీ కవితా సర్కార్‌..

52 ఏళ్ల కవిత లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. సాధారణంగా కేసు విచారణ కోసం ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నవారి కోసం.. లేదా వాదించేందుకు ఏ లాయర్‌ ముందుకు రాని పరిస్థితుల్లో ఈ కౌన్సిల్‌ వారికి న్యాయపరమైన సాయం చేస్తుంటుంది. అలా.. సంజయ్‌ రాయ్‌ కేసు కవిత చేతికొచ్చింది. హూగ్లీ మోహ్‌సిన్‌ కాలేజీ నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన కవిత.. అలిపోర్‌ కోర్టులో తన కెరీర్‌ను ప్రారంభించారు. గతేడాది జూన్‌లోనే సెల్దా కోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయవృత్తిలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె తొలుత ఎక్కువగా సివిల్‌ కేసులనే వాదించారు. గతేడాది ఫిబ్రవరిలో క్రిమినల్‌ లాయర్‌గా స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో చేరారు.

Share post:

Popular

More like this
Related

వినూత్న కథాంశంతో మైక్రో ఫిల్మ్ దిక్సూచి

స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలే ప్ర‌ధాన అంశంగా వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...