కోతులు ఇళ్ల‌లోకి వ‌స్తున్నాయ‌ని కాల్చిచంపారు

Date:

గ్రామంలోకి కోతులు వ‌చ్చి ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని, ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెల్గావ్ గ్రామంలో కోతులు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అలాగే పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలో ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించారు. కోతులను తరిమేందుకు ఇద్దరు కూలీలను నియమించారు.

గతంలో కర్రలతో కోతులను బెదరకొట్టి గ్రామం నుంచి తరిమేవారు. అయితే ఈసారి కోతులను తరిమేందుకు నియమించిన వ్యక్తులు తుపాకులు వినియోగించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆగస్ట్ 28న కోతులపై కాల్పులు జరిపి వాటిని చంపినట్లు ఆరోపించారు. సుమారు 17 కోతులు ఈ కాల్పుల్లో మరణించగా మరికొన్ని గాయపడ్డాయని తెలిపారు. దీనిపై కొందరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మరణించిన కోతుల కుళ్లిన కళేబరాలను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కొందరు అనుమానితులను ప్రశ్నించారు. అయితే కాల్పులు జరిపి కోతులను చంపారన్న వాదనలను అటవీ శాఖ అధికారి ఖండించారు. కోతుల మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...