Thursday, October 10, 2024
Homeజాతీయంకొత్త పార్టీని ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్ కిశోర్‌

కొత్త పార్టీని ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్ కిశోర్‌

Date:

‘జన్‌ సురాజ్‌ పార్టీ’ పేరుతో ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచీ ఆమోదం పొందిందని వెల్లడించారు. దీంతో బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు. ”కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించాం. అయితే.. ఈ పార్టీకి నాయకత్వం మాత్రం నా చేతుల్లో లేదు. రెండేళ్లుగా దీని కోసం శ్రమించిన వారే ఈ నిర్ణయం తీసుకుంటారు” అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

”గత 30 ఏళ్లుగా బిహార్‌ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా భాజపాకు మాత్రమే ఓటు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతం కావాలి. మా పార్టీ రాజవంశానికి చెందినది కాదు” అని అన్నారు. జన్‌ సూరజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు వెల్లడించారు. భాజపాతో కలిసి తమ పనిచేస్తుందంటూ కొన్ని విపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. బిహార్‌ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పునకు పిలుపునిచ్చిన పీకే.. విద్యారంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రాబోయే పదేళ్లలో రూ.5లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు.