కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లిన బ‌స్త‌ర్ ప్రాంతం

Date:

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ-బీజాపుర్‌ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 29న నారాయణపుర్‌ జిల్లా అబూజ్‌మాడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. తాజా ఘటనతో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 154 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు వెల్లడించారు.

Share post:

Popular

More like this
Related

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...

యూట్యూబ్ చూస్తూ బాలుడికి శ‌స్త్ర‌చికిత్స

సరైన విద్యార్హతలు లేని ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్‌ చూస్తూ బాలుడికి...

బీహార్‌లో రెండు భాగాలుగా విడిపోయిన రైలు

ఢిల్లీ నుంచి ఇస్లాంపుర్‌ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్వినిగంజ్‌-...