Saturday, December 7, 2024
Homeజాతీయంకంగ్రాట్స్ మై ఫ్రెండ్ ట్రంప్‌

కంగ్రాట్స్ మై ఫ్రెండ్ ట్రంప్‌

Date:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ట్రంప్‌నకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ”చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మునుపటి పదవీకాల విజయాలకు తగ్గట్టుగా.. భారత్‌-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసిపనిచేద్దాం. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదాం” అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే గతంలో పలు వేదికల్లో ఇద్దరు కలిసి దిగిన చిత్రాలను పంచుకున్నారు.

ట్రంప్‌ 267 ఎలక్టోరల్‌ ఓట్లతో విజయానికి అతి సమీపంలో ఉన్నారు. మరో మూడు ఎలక్టోరల్‌ ఓట్లు సాధిస్తే అధ్యక్షుడిగా ట్రంప్‌ విజయం ఖరారైనట్లే. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ”ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం. అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని మనం దక్కించుకున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై ప్రతిక్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను” అని అన్నారు.