ఈడీ అధికారులు ఐఏఎస్ అధికారి ఆమోయ్ కుమార్‌ను విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా ఈడీ అధికారులు ఆమోయ్‌కుమార్‌ను ప్రశ్నించారు.
గతంలో రంగారెడ్డి జిల్లా భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న కేసులో ఆమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా బదిలీ చేశారని ఆమోయ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలు తేల్చేందుకు ఆయన్ను విచారించినట్టు తెలుస్తోంది.